Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నమ్మ నుంచి పన్నీర్ క్యాంపుకు పాండ్యరాజన్ జంప్.. అరుణ్ జైట్లీ హస్తముందా?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:05 IST)

Widgets Magazine

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ సెల్వం క్యాంపులో చేరేందుకు కారణం ఎవరనేదానిపై ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఎంపీలంతా పన్నీర్ వెంట చేరుతున్నారంటే... వారి వెంట ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చునని కేంద్రాన్ని పరోక్షంగా ఎండగట్టిన శశికళ వ్యాఖ్యలు నిజమేనని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
కాగా శశికళ శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన పాండ్యరాజన్ ఉన్నట్టుండి పన్నీర్ క్యాంపులో చేరడం వెనుక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. బడా వ్యాపారవేత్త అయిన పాండ్యరాజన్‌కు సుదీర్ఘకాలంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సత్సంబంధాలున్నాయి. రెండేళ్ల క్రితం డీఎండీకే పార్టీ నుంచి విడివడి అన్నాడీఎంకేలో చేరిన పాండ్యరాజన్‌కు జయ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతోపాటు మంత్రి పదవీ కట్టబెట్టారు. ఇందుకు శశికళ కూడా సహకరించారు. అందుకే ఆయన ఆది నుంచి శశికళ పక్షానే నిలిచారు. 
 
పన్నీర్‌ సెల్వంను కూడా ఆయన విమర్శించారు. పార్టీని నిలబెట్టుకొనేందుకు శశికళకు అండగా నిలబడకుండా ఇలా రోడ్డెక్కడం సరికాదంటూ పన్నీర్‌కు హితోక్తులు చెప్పారు. అయితే ఉన్నట్టుండి పన్నీర్ క్యాంపులో చేరిపోవడం వెనక జైట్లీ హస్తం ఉందని.. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం పక్కాగా చక్రం తిప్పుతుందని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మతో మాట్లాడినా సహించని భూతం శశికళ: మండిపడ్డ సెల్వం

ఒక వైపు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు తన పక్షం చేరకపోవడం, మరోవైపు తనను అమ్మకు ద్రోహం ...

news

వలసపోని ఎమ్మెల్యేలు.. శశికళలో కొత్త ఉత్సాహం..

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఊహించిన స్థాయిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వలస ...

news

పన్నీర్ చెంత ఎంపీలు... శశికళ చెంత ఎమ్మెల్యేలు.. బెడిసికొట్టిన వ్యూహాలు!

తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా స్తంభనకు గురయ్యాయా? ఆదివారం సాయంత్రానికి ఆపద్ధర్మ ...

news

ఏపీ పోలీసులది రాజును మించిన రాజభక్తి: రాజ్యాంగం అమలుపై జేపీ సందేహం

రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ ...

Widgets Magazine