శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (13:02 IST)

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అంతా మోడీ శ్రమ ఫలితమే.. జైట్లీ వ్యాఖ్య

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో భారత్ చేరిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతా మోడీ శమ ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అరుణ్ జైట్లీ ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సర పాలనలో తమ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ కొత్త శక్తిని సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ చేరిందని వివరించారు. ఇంకా అభివృద్ధి చేసేందు కోసం ఈ ఏడాదిలో ప్రధాని 18 దేశాల్లో పర్యటించాని చెప్పారు.
 
దేశంలో ఆత్మహత్య చేసుకునే రైతులకు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఏడాదిలో నక్సల్స్ హింస 22 శాతం తగ్గిందని వెల్లడించారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించామని, ఆర్థికలోటును తగ్గించడంలో విజయవంతమైనట్లు జైట్లీ చెప్పుకొచ్చారు. నగదు బదిలీ పథకంలో లోపాలను సరిచేశామని వివరించారు.