గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:03 IST)

ఢిల్లీలో 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన కేజ్రీవాల్!

ఢిల్లీ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి కానుక అందించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా విద్యుత్ చార్జీలను 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నెలకు 20,000 లీటర్ల మంచి నీరును కూడా ఒక్కో ఇంటికి సరఫరా చేయబోతున్నారు. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా మీడియాతో మాట్లాడుతూ... 90 శాతం గృహా వినియోగదారులకు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు వర్తిస్తాయన్నారు. 400 కంటే ఎక్కువ ఉపయోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాలన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఆదేశం మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు.