శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (06:50 IST)

మహాద్భుతం... ఒకే రోజు ఎన్నికలకు అభ్యంతరం లేదు: కేజ్రీవాల్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకే రోజున అసెంబ్లీ ఎన్నికలు జరగడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకే రోజున అసెంబ్లీ ఎన్నికలు జరగడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారా.. అని ప్రజలు ఎదురుచూశారని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ... పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఆప్‌ గెలుపొందేందుకు ప్రజలు ఇక బహిరంగంగా మద్దతు తెలిపి కృషి చేస్తారన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడే వ్యక్తిని ఇంకా ప్రకటించలేదని ఆప్‌ మరోసారి స్పష్టం చేసింది. 
 
ఎన్నికల తర్వాత శాసనసభ్యులే సీఎంను ఎన్నుకుంటారన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున సీఎం అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎల్విస్‌ గోమ్స్‌ పోటీ చేయనున్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆప్‌ 100 స్థానాలను కైవసం చేసుకుంటుందని కేజ్రీవాల్‌ జోస్యం చెప్పారు. పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో నేటి నుంచి అధికార పార్టీలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు.