Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందరినీ సమానంగా చూస్తా.. వర్గ వివక్ష చూపబోను... యోగి.. ఎందుకు వెక్కివెక్కి ఏడ్చారు?

సోమవారం, 20 మార్చి 2017 (10:29 IST)

Widgets Magazine

హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి తెలిపారు. తమ ఎన్నికల నినాదమైన 'సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌' (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని హామీ ఇచ్చారు. 
 
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యోగి వెక్కి వెక్కి ఏడ్చిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేస్తుండగా ఈ ఘట్టాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పదేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తు చేసుకుని వుండాలి. అప్పుడు అధికారంలో ఉన్న ములాయం ప్రభుత్వం 11 రోజులపాటు యోగిని జైల్లో పెట్టింది. దీంతో బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన సాక్షాత్తు పార్లమెంటులోనే వెక్కివెక్కి ఏడ్చారు. వీడియోను నెటిజన్లు నెట్లో పోస్ట్ చేసి, షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈ తెల్లవాళ్లకు ఏం పోయేకాలమొచ్చిందో.. మతబోధకులపైనా దాడులే..

అమెరికానే కాదు.. పాశ్చాత్య ప్రపంచం మొత్తంగా జాతి విద్వేష జ్వాలలో తగులబడుతున్నట్లుగా ...

news

ఆయనే ఓ వివాదాల పుట్ట... కానీ ఇకపై వద్దంటున్నారు.. ఆహా రాజకీయమా..!

గత రెండేళ్లకుపైగా ఈ యోగి కమ్ రాజకీయనేత చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో అందరికీ ...

news

జయ మృతిపై అనుమానాలు.. మారథాన్ నిర్వహించ తలపెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల విచారణ జరపాలని డిమాండ్ చేసిన పాపానికి తేని జిల్లా ...

news

జగన్‌కి పొగరెక్కువ.. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలి: జేసీ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. ...

Widgets Magazine