Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : త్రిపురలో బీజేపీ - సీపీఎం హోరాహోరీ

శనివారం, 3 మార్చి 2018 (09:08 IST)

Widgets Magazine
election

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా త్రిపురలో బీజేపీ - అధికార సీపీఎం మధ్య హోరాహోరీగా సాగుతోంది. నాగాలాండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతోంది. అలాగే మేఘాలయలో ఎన్.పి.పి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
ఉదయం 9 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు... త్రిపుర (60)లో బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 2, సీపీఎం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, నాగాలాండ్‌(60)లో బీజేపీ 12, కాంగ్రెస్ 1, ఎన్.పి.ఎఫ్ 3 చోట్ల, మేఘాలయ(60) రాష్ట్రంలో బీజేపీ 4, కాంగ్రెస్ 9, ఎన్.పి.పి. 11, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా, త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగగా, మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్‌ జరిగింది.
 
త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్‌డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్... ఢిల్లీకి రమంటూ ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ...

news

అదే కుక్కలకీ మనుషులకీ ఉన్న తేడా... రాత్రి 11 గంటల వరకూ ఆ కుక్క అక్కడే (Video)

కుక్కకి ఒక్కసారి బిస్కెట్ వేసి చూడండి. ఇక అది జన్మలో మిమ్మల్ని మరిచిపోదు. అంతేనా... ...

news

బహిరంగంగా ఆ తల్లి చనుబాలు ఇచ్చింది.. గృహలక్ష్మి ఫోటో వైరల్..

కేరళకు చెందిన గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్‌పేజీలో ప్రచురించిన ఫోటో ప్రస్తుతం ...

news

ప్రియుడి కోసం భర్తను ఉరేసి చంపేసింది.. ఆపై గుండెపోటు వచ్చిందని?

ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపేసి నాటకమాడింది. భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్ప్రత్రికి ...

Widgets Magazine