గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (10:46 IST)

పోలీసు జీపును ఢీకొట్టిన ఆటో.. ఆటో డ్రైవర్‌‌పై ఖాకీల పిడిగుద్దులు...

రాజ్‌కోట్‌లో ఆటోడ్రైవర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. అతడిని గొడ్డును బాధినట్టుబాది తీవ్రగాయాల పాలయ్యేలా చేశారు పోలీసులు. ఇంతలా కొట్టారంటే... అతడు చేసిన తప్పు గురించి తెలిస్తే ముక్క

రాజ్‌కోట్‌లో ఆటోడ్రైవర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. అతడిని గొడ్డును బాధినట్టుబాది తీవ్రగాయాల పాలయ్యేలా చేశారు పోలీసులు. ఇంతలా కొట్టారంటే... అతడు చేసిన తప్పు గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. వేగంగా వస్తున్న ఆటోరిక్షాను పొరపాటున పోలీస్ జీపుకు ఢీకొట్టడమే. ఆంతే ఆక్రోషంతో ఊగిపోయిన పోలీసులు హుటాహుటిన జీపులో నుండి శరవేగంగా బయటకు దూకి అతడిపై దాడికి దిగారు. 
 
కనీసం కనికరం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టి... అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇదంతా అక్కడ ఉన్న స్థానికులు ఫోన్లలో రికార్డ్ చేశారు. తీవ్రగాయాలపాలైన అతడిని మానవతా దృకృథంతో ఆసుపత్రికి కూడా తరలించకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లిన తీరుపై విమర్శలు తలెత్తాయి.