శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:33 IST)

జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలు అమలు చేయాలి : బాబా రాందేవ్

జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. ముఖ్యంగా.. ఓ మతస్తుల కారణంగానే జనాభా అధికమవుతుండడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఆదివారం ఛండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు చైనా తరహా కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కివక్కాణించారు. జనాభా పెరుగుదలను కట్టడి చేసేందుకు నిర్దిష్ట జనాభా విధానం అవసరమన్నారు. 
 
ఇటీవలే కేంద్రం మతాల వారీగా జనాభా లెక్కలను విడుదల చేయడం తెలిసిందే. ముస్లింల జనాభాలో ఏటా 0.8 శాతం పెరుగుదల కనిపిస్తుండగా, అదే సమయంలో హిందువులు, సిక్కుల జనాభాలో పెరుగుదల తక్కువగా ఉందని జనగణన లెక్కల్లో బహిర్గతమైన విషయం తెల్సిందే.