శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (11:45 IST)

బాబ్రీ, రామ‌జ‌న్మ భూమి వివాదం : ప్రధాన పిటీషన్‌దారుడు మృతి

వివాదాస్పద బాబ్రీ, రామజన్మ భూమి వివాదంలో వ్యాజ్యం దాఖలు చేసిన మహంత్ భాస్కర్ దాస్ మృతి చెందారు. ఆయనకు శనివారం వేకువజామున తీవ్రమైన గుండెపోటురావడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో రామజన్మభూమి వివాదాస్పద కేసులో

వివాదాస్పద బాబ్రీ, రామజన్మ భూమి వివాదంలో వ్యాజ్యం దాఖలు చేసిన మహంత్ భాస్కర్ దాస్ మృతి చెందారు. ఆయనకు శనివారం వేకువజామున తీవ్రమైన గుండెపోటురావడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో రామజన్మభూమి వివాదాస్పద కేసులో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారిలో ఇద్దరు కీలక లిటిగెంట్లు చనిపోయారు. 
 
ఈయన 1929లో గోర‌ఖ్‌పూర్‌లోని రాణీధీలో జ‌న్మించగా, 1946లో ఆయ‌న అయోధ్య‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత 1959లో బాబ్రీ మ‌సీదు కేసులో నిర్మోహి అకాడాకు చెందిన భాస్క‌ర్‌ దాస్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన వ్య‌క్తుల్లో కీల‌కుడు. 2003, 2007లోనూ ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చింది. కానీ ఈసారి గుండెపోటు తీవ్రంగా రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, బాబ్రీ, రామ‌జ‌న్మ భూమి వివాదంలో మొత్తం ముగ్గ‌ురు కీల‌క వ్య‌క్తులు వ్యాజ్యాల‌ను వేశారు. అందులో భాస్క‌ర్ దాస్ ఒకరు. ఇపుడు ఈయన మృతి చెందడంతో బాబ్రీ వివాదంలో కేసు వేసిన హిందూ, ముస్లిం మ‌తాలకు చెందిన చీఫ్ లిటిగెంట్లు క‌న్నుమూసినట్టయింది. ముస్లింల త‌ర‌పున హ‌సిమ్ అన్సారీ బాబ్రీ వివాదంలో కేసు వేశారు. బాబ్రీ వివాదంలో ఈ ఇద్ద‌రూ విరోధులుగా పోరాడినా, వాళ్ల మ‌ధ్య మాత్రం మంచి స్నేహ‌సంబంధాలు ఉండేవి.