శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Modified: గురువారం, 21 ఆగస్టు 2014 (13:45 IST)

చిరంజీవి బంగ్లా: వాస్తు బాగోలేదు.. వెయిట్ చేద్దాం: రాజ్‌‌నాథ్

చిరంజీవి బంగ్లాకు వాస్తు బాగోలేదట. ఇదేంటి అనుకుంటున్నారా? కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తాత్కాలిక ఊరట లభించినట్లు తెలుస్తోంది. 17, అక్బర్ రోడ్డులోని చిరంజీవి బంగ్లాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. 
 
ఈ బంగ్లాను చిరంజీవి ఖాళీ చేస్తే.. అందులోకి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లాల్సి ఉంది. ఈ బంగ్లాను చిరు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా తీర్చిదిద్దిన బంగ్లాను రాజ్‌నాథ్‌కు కేటాయించారు. కానీ, ప్రస్తుతం రాజ్‌నాథ్ సింగ్ ఈ బంగ్లాలోకి ఇప్పటికిప్పుడే మారేందుకు ఆసక్తి చూపట్లేదట. అందుకు వాస్తు కారణమని చెబుతున్నారు. 
 
యూపీఏ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవికి 2012లో 17, అక్బర్ రోడ్డులో టైప్ 8 బంగ్లాను కేటాయించారు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కావడంతో.. తాను రాజ్యసభ సభ్యుడిని అయినందున తనకు అర్హమైన మరో బంగ్లాను చూపించాలని చిరంజీవి సంబంధిత శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ కూడా రాశారు. 
 
ఇదిలా ఉండగా.. చిరు బంగ్లాను తనకు కేటాయించినప్పటికీ రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికిప్పుడు తాను ప్రస్తుతం నివసిస్తున్న అశోక రోడ్డులోని భవనాన్ని ఖాళీ చేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదట. 
అందుకు చిరు నివాసం ఉంటున్న బంగ్లాలో వాస్తుదోషం ఉండటమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఖాళీ చేశాక.. బంగ్లాలో మార్పులు చేర్పులు చేసి మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.