చికెన్ షాపు నుంచి ఇంటికొచ్చిన భర్త.. ప్రియుడి పక్కలో భార్య... కళ్లారా చూసి ఏం చేశాడంటే..

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (13:44 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనకుకాకుండా మరో వ్యక్తికి పడక సుఖం ఇస్తున్నపుడు కళ్లారా చూసిన ఆ కిరాతకుడిగా మారిపోయాడు. దీంతో తన తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అజ్జంపుర ప్రాంతానికి చెందిన సతీశ్ అనే అదేప్రాంతానికి చెందిన రూప (28) అనే మహిళను 9 యేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గతంలో డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన సతీశ్.. ఆ పనికి స్వస్తిపలికి తాము నివశించే ప్రాంతంలోనే చికిన్ షాపు తెరిచాడు. 
 
ఈ నేపథ్యంలో చికెన్ షాపుకు వచ్చి వెళ్లే సునీల్ అనే వ్యక్తితో రూపకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సతీశ్‌కు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు. రూప ప్రవర్తనలో మార్పురాలేదు. చివరకు విషయం కుటుంబ సభ్యులకు తెలిసి పెద్దలు రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం సతీశ్ ఎప్పటిలాగే చికెన్ షాపు తెరిచాడు. కొంతసేపటి తర్వాత ఏదో పనినిమిత్తం ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పడక గదిలో ప్రియుడి పక్కలో భార్య ఉండటాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక పోయాడు. వెంటనే వంటింట్లో ఉన్న కొడవలితో సునీల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, అతను తప్పించుకుని పారిపోయాడు. 
 
దీంతో అతని కోపం నషాళానికెక్కింది. అంతే.. అదే కొడవలితో భార్య రూపపై విచక్షణారహితంగా దాడిచేశాడు. చివరికి ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. అనంతరం బైక్‌పై 20 కి.మీ వెళ్లి అజ్జంపుర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఒక్కసారి వస్తావా అంటూ.. మహిళా జర్నలిస్టును కన్నుకొట్టి వేధించిన లాయర్...

సుప్రీంకోర్టు సాక్షిగా ఓ మహిళా జర్నలిస్టును న్యాయవాది ఒకరు లైంగికంగా వేధించాడు. ఒక్కసారి ...

ఘోరం.. బ్రేకులు ఫెయిలై లోయలో పడిన బస్సు - 32 మంది మృత్యువాత

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై ...

బిజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై స్కెచ్ వేసిన గులాబీ దండు...

టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూనే, మరోవైపు వ్యక్తిగంతగా కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ...

ప్రియుడితో పడకసుఖానికి అడ్డొస్తుందనీ కన్నబిడ్డకు చిత్ర హింసలు

ఓ కన్నతల్లి అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన ప్రియుడుతో కలిసి పడకసుఖం పంచుకునే సమయంలో ...