Widgets Magazine

బెంగళూరులో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు: సీఐ భార్య మెడలోని?

బెంగళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు పెట్టే మహిళలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో పీణ్య పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న సీఐ కెంచెగౌడ భార్య గంగమ్మ మెడలోన

chain snatching
selvi| Last Updated: బుధవారం, 17 జనవరి 2018 (11:50 IST)
బెంగళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు పెట్టే మహిళలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో పీణ్య పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న సీఐ కెంచెగౌడ భార్య గంగమ్మ మెడలోని చైనును దుండగులు కొట్టేశారు. పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో కంచెగౌడ విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కెంచేగౌడ భార్య గంగమ్మ ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 70 గ్రాముల బంగారు చైన్‌ లాక్కొని పారిపోయారు. గంగమ్మ గట్టిగా కేకలు వేసినా.. దొంగను పట్టుకునేందుకు చూసినా ఫలితం లేకపోయింది. ఇంట్లోకి వచ్చి మరీ గంగమ్మ మెడలోని చైనును లాక్కెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నమోదైనాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగల్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

ఇదే తరహాలో బెంగళూరులోని కామత్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్న శారదమ్మ ఇంటి ముందు నిలబడి ఉండగా దుండగలు ఒక్కసారిగా వాహనంలో వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా.. మల్లసంద్ర, బృందావన లేఔట్‌ పైపులైన్‌ రోడ్డులో నివాసం ఉంటున్న సౌధమణి చైన్‌ను దుండగులు లాక్కెళ్లారు. చైన్ స్నాచింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు దొంగల్ని పట్టుకునేందుకు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.


దీనిపై మరింత చదవండి :