కండోమ్ లేకుండా సెక్స్ చేస్తానన్నాడు.. తీరా ఆ సమయానికి ఆ మహిళ ఏంచేసిందంటే..?

romance
జె| Last Updated: శనివారం, 25 జనవరి 2020 (20:06 IST)
డ్యూటీ నుంచి ఇంటికి వెళుతోన్న అతనికి బస్టాండ్ వద్ద ఓ మహిళ ఎదురుపడింది. మాటలు కలిపారు. 2500కు బేరం కుదిరింది. అడ్వాన్స్‌గా 500 తీసిచ్చాడు. ఇద్దరూ కలిసి ఆమె ఉంటోన్న ప్రాంతానికి వెళ్లారు. ఆటో దిగగానే మరో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు. తీరా గదిలోకి వెళ్లిన తర్వాత ఆమె కండిషన్ పెట్టింది. కండోమ్ లేకుండా సెక్స్ వద్దని చెప్పింది. అలా వారి మధ్య మొదలైన గొడవ చివరికి హత్యకు దారితీసింది. సుమారు పదిరోజులు గాలింపు తర్వాతగానీ నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు.

42 ఏళ్ల మహిళ భర్తను వదిలేసి, కొడుకుతోపాటు వెస్ట్ బెంగళూరులోని గాయత్రి నగర్ లో నివసిస్తోంది. పొట్టకూటికోసం సెక్స్ వర్కర్ గా పనిచేస్తోన్న ఆమెకు ఈ నెల15న ముకుందా అనే వ్యక్తి ఎదురయ్యాడు. మాండ్యాకు చెందిన ఆయన చాలా ఏళ్లుగా బెంగళూరులోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బేరం కుదిరిన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె ఇంటికెళ్లారు. అసురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కలిగిన ఆమె.. కండోమ్ ధరించాల్సిందిగా అతన్ని కోరింది.

అయితే ముకుందా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కండోమ్ లేకుండానే బలవంతం చేయబోయాడు. ఎంతకీ వీలుపడకపోవడంతో తన డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తిరిగివ్వడం కుదరదని ఆమె చెప్పడంతో ఎక్కువ మాట్లాడితే చుట్టుపక్కలవాళ్లకు వినిపించేలా గోలచేస్తానని బెదిరించడంతో ముకుంద్ ఉన్మాదిలా మారిపోయాడు. తన బ్యాగులో కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచేశాడు. బాధతో కేకలు వేయబోతుండగా గొంతు కూడా కోసేసి, ఆమె ఒంటిమీదున్న గిల్టు నగలు, సెల్ ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన కొడుకు.. శవంగా మారిన తల్లిని చూసి, పక్కింటివాళ్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ సెల్ ఫోన్ స్విచాఫ్ కావడంతో, పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరకలేదు. వారం రోజుల పాటు హత్య జరిగిన ఏరియాలోని అన్ని సీసీటీవీ కెమెరాల రికార్డుల్ని పరిశీలించగా.. చివరికి ఓకే ఒక్క కెమరాలో నిందితుడు హతురాలితో కలిసున్న విజువల్స్ దొరికింది.

దాని ఆధారంగా గాలించిన పోలీసులు శనివారం ఉదయం ఎట్టకేలకు నిందితుణ్ని పట్టుకున్నారు. హత్య చేసింది తానేనని అంగీకరించడంతో ముకుంద్ ను రిమాండ్ కు తరలించారు. సుమారు 10రోజుల తరువాత కేసును పోలీసులు చేధించారు.దీనిపై మరింత చదవండి :