Widgets Magazine Widgets Magazine

పోయెస్ గార్డెన్ గురించి మీకు తెలుసా? ఎంతకు కొన్నారంటే..? రూ.1.37లక్షలకు?

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (11:25 IST)

Widgets Magazine
jayalalithaa

దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ జయ మెమోరియల్‌గా మార్చనున్నట్లు ఆ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయనున్నట్లు వెల్లడించారు. పోయెస్‌గార్డెన్‌లో ఉండే హక్కు శశికళకు లేదని.. ఆమెను అక్కడి నుంచి తరిమేస్తామని చెప్పారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ప్రస్తుతం పోయేస్ గార్డెన్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. 
 
పోయెస్ గార్డెన్ నుంచే అమ్మ అన్నీ పనులు చేశారు. 1967లో జయలలిత తల్లి వేదవల్లి రూ.1.37లక్షలకు కొన్నారు. 24వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఈ విలాసవంతమైన ఇల్లుకు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.90కోట్ల విలువ ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా వేస్తున్నారు. జయలలిత వీలునామా రాయకుండానే హఠాన్మరణం చెందారు. ఆమె మృతి చెందిన వెంటనే శశికళ బంధుగణం అంతా పొయెస్ గార్డెన్‌లో వాలిపోయింది. చిన్మమ్మ భర్త నటరాజన్, కుటుంబమంతా ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.
 
చట్ట ప్రకారం రక్త సంబంధీకులకు మాత్రమే ఆ ఇంటిపై హక్కుంది. జయలలిత రూపాన్ని సొంతం చేసుకున్న ఆమె కోడలు దీపా జయకుమార్, అల్లుడు దీపక్ జయకుమార్‌కు ఇంటిపై హక్కులున్నాయి. వాటిపై చట్టప్రకారం వాళ్లు స్వాధీనం చేసుకోవచ్చు. అయితే, అమ్మ ఆస్తులను తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, ఆమె ఆశయాలే తనకు ముఖ్యమని దీపా జయకుమార్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. 
 
జయలలిత బతికున్న రోజుల్లో ఈ ఇల్లు ఓ వెలుగు వెలిగింది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు, కీలక నిర్ణయాలకు, అనూహ్య ఘటనలకు వేదికగా నిలిచింది. జయలలిత హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమె తల్లి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి జయలలిత శాశ్వత నివాసం ఇక్కడే. జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటిలోనే ఉన్నారు. 
 
అన్నాడీఎంకే రాజకీయాలకు పోయెస్ గార్డెన్ కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. అమ్మ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీఐపీలు, పలు రంగాల ప్రముఖులతో ఈ ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ బోసిపోయింది.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించి.. పెళ్ళికూడా చేసుకున్నారు.. అయితే తొలిరోజే నపుంసకుడని తెలిసి?

ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య ...

news

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం.. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు..

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై ప్రజలు పోలీసులను తీరును ...

news

చదువు రాకపోవడంతో చాలా బాధపడ్డాను.. డిప్రేషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్

తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు ...

news

సహనానికీ ఓ హద్దుందన్న శశికళ.. చెన్నైలో హై అలెర్ట్.. అసాంఘిక శక్తులు చొరబాటు..?

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, ...