బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (16:55 IST)

సిద్ధి వినాయక్ టెంపుల్‌లో భారీ జనసందోహం... పేల్చేద్దామనుకున్నాం... హెడ్లీ

ముంబై దాడుల్లో నరమేథం సృష్టించిన కీలక సూత్రధాని డేవిడ్ హెడ్లీని మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ విచారణలో హెడ్లీ గుగుర్పొడిచే నిజాలను వెల్లడించాడు. 2008లో ముంబై దాడులకు ముందు ముంబైలోని సిద్ధి వినాయక్ ఆలయాన్ని పేల్చేయాలని చూశామన్నారు. ఆ దేవాలయం నిత్యం జనసందోహంతో రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ దాడి చేస్తే వందల్లో ప్రాణాలు తీయవచ్చని లష్కరే ప్రణాళిక చేసిందని తెలిపాడు. 
 
ఐతే అది వీలుకాలేదని చెప్పుకొచ్చాడు. అలాగే ముంబై దాడులకు ముందు తాజ్ హోటల్ పైన దాడి చేసేందుకు 2008కి ముందు రెండుసార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లు కూడా వెల్లడించాడు. అప్పుడే తాజ్ హోటల్‌లో జరిగిన రక్షణశాఖ శాస్త్రవేత్తల సమావేశంపై దాడులు చేసేందుకు పన్నాగం వేశామనీ, అది కూడా సాధ్యం కాలేదని చెప్పుకొచ్చాడు. 
 
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఉగ్రవాది హెడ్లీ తాను పాల్గొన్న కొన్ని సమావేశాల్లో ఐఎస్ఐ అధికారులు కూడా పాల్గొంటుండేవారని వెల్లడించాడు.  అమెరికాలో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీ రెండో రోజు వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టుకు తన వాంగ్మూలాన్ని వినిపించాడు.