Widgets Magazine Widgets Magazine

నా భర్త చావుకేక నాకు వినిపించి తర్వాత చంపేయ్...26 ఏళ్ల ప్రియుడితో 28 ఏళ్ల ప్రియురాలు

సోమవారం, 29 మే 2017 (18:01 IST)

Widgets Magazine
couple

ఫోటో కర్టెసీ, ఫేస్ బుక్
దారుణాలు అటు స్త్రీలపైన ఇటు పురుషులపైనా చోటుచేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ స్త్రీ తన భర్తను ఎలా హత్య చేయాలో తన ప్రియుడికి చెప్పించి చంపిన వైనం గగుర్పొడిచేట్లు చేస్తోంది. వివరాల్లోకి వెళితే... 28 ఏళ్ల మనువా మజుందార్ అనే మహిళ పశ్చిమబెంగాల్‌లోని బరసాత్ మునిసిపాలిటీలో క్యాజువల్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త 34 ఏళ్ల అనుపమ్ సిన్హా ట్రావెల్ ఏజెన్సీలో మేనేజరుగా వున్నాడు. 
 
ఐతే కాలేజీ రోజుల్లో తనకంటే రెండేళ్ల చిన్నవాడైన అజిత్ రాయ్ తో కలిసి చక్కెర్లు కొట్టేది. కానీ ఇంట్లో వయసు తేడా అంటారేమోనని అనుపమ్ ను పెళ్లాడింది. కానీ అజిత్ ను మాత్రం వదల్లేదు. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలిస్తే గొడవవుతుందని, తన భర్తను గుట్టుచప్పుడు కాకుండా చంపేయాలని ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి దాన్ని అమలు పరచాలని చూసింది కానీ ఆ సమయానికి ఆమె అక్కడ వుండటం సాధ్యపడలేదు. దానితో ప్రియుడే ఆమె భర్తకు కాలయముడై అతడిని హతమార్చాడు. 
 
ఆ సమయంలో భర్త పెట్టిన చావుకేక ఫోన్లో విని తెగ సంతోషించింది. అత్యంత దారుణంగా అతడిని చంపిన వైనాన్ని పోలీసులు ఇలా చెప్పుకొచ్చారు. అనుపమ్‌ ఉండే ఫ్లాట్‌లోకి అతడి భార్య మనువా ఇచ్చిన తాళాలతో అజిత్ చేరుకున్నాడు. అతడు లోపలకి ప్రవేశించగానే ఇనుప రాడ్‌తో తలమీద కొట్టి అతడు కింద పడిపోగానే అదే రాడ్డును తీసుకుని అతని గొంతులో పొడిచాడు. దాంతో అతడు తీవ్రమైన బాధతో ఆర్తనాదాలు చేశాడు. వాటిని అజిత్ తన ప్రియురాలు, అనుపమ్ భార్య అయిన మనువాకు వినిపించాడు. 
 
ఆ చావు కేకలు విన్న ఆమె ఎంతో సంబరపడిపోతూ... ఆ అరుపులు ఆగేట్లు చేసేయ్ అంటూ అతడికి చెప్పింది. దాంతో అతడు మరింత వికృతంగా ప్రవర్తించాడు. ఆ రాడ్డును అలాగే వుంచి అనుపమ్ మెదడులో నరాలను కత్తితో కోసి మరీ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అపార్టుమెంటును శుభ్రం చేయడమే కాకుండా కత్తి, రాడ్, రక్తపు మరకలతో తడిసిన దుస్తులన్నిటినీ గంగా నదిలో వదిలి వచ్చాడు. ఈ హత్యపై పోలీసులు కూడా షాకయ్యారు. అంత దారుణంగా భర్తను హత్య చేయించడం ఇంతవరకూ తాము చూడలేదని అన్నారు. 
 
మరోవైపు అనుపమ్ సహోద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి తన భార్య సంగతి తెలుసుననీ, అనవసరంగా ఆమెను పెళ్లాడానని వాపోతుండేవాడనీ, ఐనా తన భర్తతో కలిసి వుండటం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసి అతడితో కలిసి వెళ్లిపోతే పోయేది కదా... దారుణంగా భర్తను పొట్టనకున్నదంటూ ఆమెను దూషించారు. కానీ ఆమెలో మాత్రం లేశమాత్రంగానైనా బాధ కనిపించకపోవడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ ...

news

జపాన్ ఇంజినీరుపై లైంగికదాడి: 3వారాల్లోనే నిందితుడికి జైలుశిక్ష-మధ్యప్రదేశ్ కోర్టు అదుర్స్

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేరాల కింద నిందితులకు ...

news

రామ్మోహన్, అఖిలప్రియలపై బాబు ప్రశంసలు.. రైతుల వద్దకు టెక్నాలజీ..

మహానాడు వేదికపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ...

news

జగనూ.. వైకాపా అధ్యక్షురాలిగా లక్ష్మీపార్వతిని ప్రకటించు చూద్దాం..!: సోమిరెడ్డి సవాల్

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు విసిరారు. ...