Widgets Magazine

ఐటీ దాడులు... రూ.5 కోట్ల రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు... ఏ బ్యాంకు మోసం...?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:12 IST)

Widgets Magazine
Rs 1000

బెంగళూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే డబ్బు తీసుకునే వీలుంటోంది. ఐతే నల్లకుబేరుల సత్తా ఏమిటో మరోసారి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్ల లోనే దాదాపు ఈ డబ్బంతా ఉంది.
 
అంతేకాదు, ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐదు కేజీల బంగారం, ఐదు కేజీల ఆభరణాలు, స్పోర్ట్స్‌ కార్లు, లాంబార్గిని వంటివి కూడా లభ్యమయ్యాయి. బెంగళూరులోని ఓ ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించగా ఇవన్నీ బయటపడ్డాయి. జనాలు డబ్బుల్లేక అల్లాడుతుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త డబ్బు ఎలా చేతికొచ్చిందని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. 
 
అయితే, ఆ అధికారుల వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు. వీరికి పలు బ్యాంకు అధికారులు సహాయసహకారాలు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజల నోళ్లలో మన్నుకొట్టి ఆ డబ్బును ఇలా పక్కదారికి మళ్లించి మోసం చేసిన ఆ బ్యాంకుల వివరాలు ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bengaluru 5 Crores Demonetisation New 2000 Notes It Raids

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముఖేష్ అంబానీ ప్రకటనతో రూ.3వేల కోట్ల పతనం: 3 నెలల్లో 900 కోట్ల జియో కాల్స్‌ బ్లాక్ చేశాయట..!

ప్రముఖ వ్యాపార వేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొబైల్ డేటా రంగంలో ...

news

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త డౌట్లు... జంతువుల కొవ్వుతో చేశారా? చిప్ పెట్టాలనుకున్నా కానీ వ్యయం?

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలోకి కొత్త కరెన్సీ ...

news

పారికర్ కళ్లు పీకేస్తారా?రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రదాడులు తప్పవ్: ఫరూక్ అబ్ధుల్లా

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ...

news

ఖాతాదారులకు మజ్జిగ, మంచినీరు.. ఆ ఘటనపై క్షమాపణ చెప్తున్నా: డీజీపీ

పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌‌లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో ...