శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:14 IST)

దాడి జరుగుతుంటే పోలీసులు లంకించుకున్నారు.. వివస్త్రగా పోలీస్ స్టేషన్ కెళితే లెక్కచేయలేదు!

తనపై దాడి జరుగుతుంటే చూస్తుండిపోయిన పోలీసులు ఆపై పరుగులు లంకించుకున్నారని టాంజానియా విద్యార్థిని చెప్పుకొచ్చింది. బెంగళూరులో చదువుకుంటున్న టాంజానియా విద్యార్థినిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గత ఆదివారం రాత్రి ఓ విదేశీయుడి కారు ఢీకొని బెంగళూరులో ఓ మహిళ మృతి చెందింది. అదే సమయంలో అటుగా వచ్చిన టాంజానియా విద్యార్థిపై బెంగళూరు వాసులు విరుచుకుపడ్డారు. 
 
ఈ సందర్భంగా ఆ యువతిని చితకబాదిన కన్నడిగులు, ఆమెను వివస్త్రను చేసి నడిరోడ్డుపై పరుగులు తీయించారు. ఈ వ్యవహారంపై టాంజానియా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కాపాడమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడి పోలీసులు కూడా స్పందించలేదన్న వార్తలతో ఈ వివాదం ముదిరింది. 
 
ఈ నేపథ్యంలో టాంజానియా తనపై జరిగిన దాడికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తుండిపోయారని ఆరోపించింది. అంతేకాక అక్కడి నుంచి పోలీసులు పరుగు లంకించుకున్నారని కూడా ఆ యువతి పేర్కొంది.
 
కారు ప్రమాదంలో 35ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిందని, తనపై దాడి జరగడంతో పాటు వివస్త్రను చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు ఏమాత్రం లెక్కచేయలేదని టాంజానియా విద్యార్థిని చెప్పుకొచ్చింది. కాగా ఢిల్లీలోని టాంజానియా రాయబార కేంద్రం.. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను చేతికందుకుంది. ఇక బెంగళూరు సిటీ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.