Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేనే 'అమ్మ' కుమార్తెను.. డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి...

సోమవారం, 27 నవంబరు 2017 (18:14 IST)

Widgets Magazine
shoban babu - jayalalithaa

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు మధ్య ప్రేమాయణం సాగినట్టు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరికి ఓ కుమార్తె పుట్టిందనీ, ఆమె లండన్‌లో చదువుతున్నారంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇపుడు ఈ వార్తలను నిజం చేస్తూ బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ముందుకు వచ్చారు. తానే జయలలిత కుమార్తెను కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోండంటూ సవాల్ విసురుతోంది. ఇందుకోసం ఆమె న్యాయ పోరాటం సైతం చేస్తోంది. 
 
జయలలిత వారసురాలినంటూ చెప్పుకుంటున్న ఆ యువతి పేరు అమృత సారథి అలియాస్ మంజుల. వయసు 37. ఈమె సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. తాను జయలలిత కూతురునని… కావాలంటే తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవచ్చునని కోరింది. 'నేను జయలలిత కూతుర్నే. జయలలిత సోదరి నన్ను పెంచి పెద్ద చేశారు. జయలలిత మృతి చెందిన తర్వాత నాకు ఈ రహస్యాన్ని చెప్పారు' అని పేర్కొంది. ఈ పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు తోసిపుచ్చింది. పైగా, కర్ణాటక హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలిత జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. పైగా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ క్రమలోనే జయ మృతి చెంది ఏడాది కావస్తున్న తర్వాత కూడా ఆమె వారసులం తామంటే తామేనంటూ.. పలువురు ముందుకొస్తున్నారు. గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కోవలోనే మంజలు కూడా పిటీషన్ దాఖలు చేసినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బండ్ల గణేష్‌కు జైలు శిక్ష వెనుక ఆ పార్టీ హస్తం...

హాస్య నటుడు, టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌కు ఎర్రమంజలి ...

news

ఇవిగో రూ.1.5 కోట్లు, నటి భావనను రేప్ చెయ్... రిపోర్టులో షాకింగ్...

మలయాళ సినీ ఇండస్ట్రీలో నటి భావనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భావనపై ...

news

డొనాల్డ్ ట్రంప్‌కి తర్వాత ఇవాంకానే ప్రెసిడెంట్: మలియాకు సపోర్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ...

news

జగన్ హేళనగా మాట్లాడారట... అందుకే గేట్లు మూసేశారట పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి

వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ ...

Widgets Magazine