Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. మోడీ స్వాగతం

ఆదివారం, 14 జనవరి 2018 (15:48 IST)

Widgets Magazine
mdi - netanyahu

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నెతన్యాహును మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సారా నెతన్యాహు కూడా ఉన్నారు.
 
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మన దేశానికి రావడం 15 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి. పదిహేనేళ్ళ క్రితం 2003లో ఆ దేశ ప్రధాని ఏరియల్ షరాన్ మన దేశానికి వచ్చారు. నెతన్యాహు ప్రయాణించిన విమానంపై భారతదేశం, ఇజ్రాయెల్ దేశాల జాతీయ పతాకాలు ఉన్నాయి. నెతన్యాహు మన దేశంలో 6 రోజులపాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాటం, వ్యాపార సంబంధాల బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి.
 
ఈ సందర్భంగా తీన్‌ మూర్తి చౌక్‌ పేరును తీన్‌ మూర్తి హైఫీ చౌక్‌గా మార్చనున్నారు. నెతన్యాహు పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11 యేళ్ల బాలుడు మోషే కూడా భారత్‌ వచ్చాడు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం : పాకిస్థాన్

తమ పాలకులు అనుమతిస్త భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ...

news

అగ్ని-5 పరీక్షకు సిద్ధమైన భారత్.. పాకిస్థాన్‍కు ముచ్చెమటలు

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో ...

news

గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందేలు... రూ.కోట్లలో బెట్టింగ్స్

సంక్రాంతి పండుగ అంటేనే కోళ్ల పందేలు. ఎవరు ఎన్ని చెప్పినా... కోర్టులు వివిధ రకాల అంక్షలు ...

news

రూ.500 ఇస్తే చాలు.. మీరేమైనా చేసుకోవచ్చు.. రొమాన్స్ కేంద్రాలుగా పార్కులు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కులు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారాయి. ...

Widgets Magazine