శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 18 జులై 2018 (14:22 IST)

చంద్రబాబు తెదేపాకు సోనియా గాంధీ మద్దతు... 2019లో ఏం జరుగబోతోందో?

నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం

నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. 
 
అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారు లేచి నిలబడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే... టీడీపీ ఎంపీలు లేచి నిలబడగా వారికి మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు కూడా టీడీపీ తీర్మానాన్ని సమర్థిస్తూ నిలబడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టీడీపీ ఇచ్చిన తీర్మానానికి మద్దతిస్తూ లేచి నిలబడటంతో ఆశ్చర్యం కలిగింది. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఏకమవుతాయనేందుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు ఇటీవలే కర్నాటక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సైతం రాహుల్ గాంధీతో మంతనాలు చేసిన సంగతి తెలిసిందే.