శనివారం, 30 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (13:03 IST)

బీహార్‌లో బీజేపీదే హవా : తేల్చేసిన తాజా సర్వే..! ఊపిరి పీల్చుకున్న ఎన్డీయే!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి తాజా సర్వే బూస్ట్ ఇచ్చినట్లైంది. త్వరలో జరగనున్న బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారమని తాజా సర్వే తేల్చేసింది. బీహార్‌లో బీజేపీకి బీజేపీకి 53.8 శాతం ఓట్లు వస్తాయని ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. అలాగే బీజేపీకి 187 సీట్లు వస్తాయని, మహా కూటమికి 64 సీట్లు, 40.2 శాతం ఓట్లు రావచ్చని, ఇక ఇతరుల స్థానం నామమాత్రమేనని తెలిపింది. 
 
బీహారులో 243 అసెంబ్లీ స్థానాలుండగా, అక్టోబర్ 12న ఎన్నికలు తొలి విడత మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఆపై 16, 28, నవంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో భాగంగా జితన్ రామ్ మాంఝీ, రామ్ విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుశాహ్వ తదితర నేతలు ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ పడుతున్నారు. అలాగే బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 54.6 శాతం మంది ఎన్డీయే కూటమికి, 39.7 శాతం మంది నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.  
 
ఏ పార్టీకి అవకాశాలున్నాయని, బీహార్ రాజకీయాల్లో శక్తిమంతమైన యాదవుల వర్గాన్ని అడిగితే, 50 శాతానికి పైగా మహా కూటమి విజయం సాధిస్తుందని తెలుపగా, ఎన్డీయే గెలుస్తుందని 43.7 శాతం మంది వ్యాఖ్యానించారు.