Widgets Magazine

నీ ఫ్రెండ్‌ను రేప్ ఎలా చేశాడు? రేప్ చేస్తుంటే నీవు ఏం చేశావు? విద్యార్థినితో బీహార్ ఎమ్మెల్యే అసభ్య ప్రశ్నలు

గురువారం, 12 జనవరి 2017 (07:10 IST)

Widgets Magazine

బీహార్ ఎమ్మెల్యే ఒకరు ఓ విద్యార్థినిని అడగకూడని ప్రశ్నలు సంధించాడు. సదరు ప్రజాప్రతినిధి వేసిన ప్రశ్నలకు ఆ విద్యార్థిని సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయింది. అయినప్పటికీ.. వదలిపెట్టని ఆ ఎమ్మెల్యే... రేపు నీకు ఇదే విధంగా జరిగితే ఏం చేస్తావు? ఆ కామాంధుడు నీ గదికి వచ్చి రేప్ చేస్తే ఏం చేస్తావు? నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇత్యాది ప్రశ్నలు సంధించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
బీహార్‌లోని వైశాలి జిల్లాలో దళిత విద్యార్థినుల ఆశ్రమ పాఠశాల వసతి గృహం ఉంది. ఇక్కడ ఉంటున్న ఒక విద్యార్థిని రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లాలన్ పాసవాన్ హాస్టల్‌కు వెళ్లారు. 
 
ఈ సంఘటనపై విద్యార్థినులను ఆరా తీసే క్రమంలో అడగకూడని ప్రశ్నలు సంధించాడు. ఇవే ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఒక విద్యార్థిని ఇబ్బందిపడుతూ సమాధానాలు చెబుతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో రావటంతో విమర్శలు తలెత్తాయి.
 
సదరు విద్యార్థినితో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు గురించి చెప్పాలంటే... ‘ఆ రేప్ సంఘటన గురించి వివరంగా చెప్పాలి. నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ, ఇటువంటి రేప్ నీకే జరిగితే? అత్యాచారం చేసే వ్యక్తి నీ గదికే వస్తే...’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఆ విద్యార్థిని అవాక్కయింది. దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 
దళిత విద్యార్థినులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయమై ప్రశ్నిస్తే, మీడియా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తాను అడిగిన విధానం తప్పయితే అయి ఉండవచ్చు కానీ, తన ఉద్దేశం మాత్రం మంచిదేనని ఆ ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'గే' అని తెలియగానే... కాళ్లుచేతులు కట్టేసి.. భవనం నుంచి కిందికి తోసేసిన ఐసిస్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే కనిపించడం లేదు. ఈ ఉగ్రవాదుల పట్ల ...

news

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్.. సారీ చెప్తారా? వీసా రద్దు చేయమంటారా?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ...

news

మోదీ పెద్దపులా.. అబ్బే.. చిట్టెలుక అంటున్న తృణమూల్

మద్దతుదారులు చెబుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపులి కాదని, గుజరాత్‌లో తన ...

news

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటున్న మన్మోహన్

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ముందుంది ముసళ్ల పండుగ సామెతను మక్కీకి మక్కీకిగా ...