శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:07 IST)

అమ్మాయిలకు జీన్స్, సెల్‌ఫోన్ వద్దు: బీహార్‌ పంచాయతీ పెద్దలు

అమ్మాయిలపై అఘాయిత్యాలను నియంత్రించడానికి చట్టాలు వచ్చినా కొన్ని పంచాయతీలు మాత్రం మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే తరహాలో అమ్మాయిలు జీన్స్ ధరించకూడదని, సెల్ ఫోన్ వాడకూడదని బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని ఓ పంచాయతీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.
 
అమ్మాయిలు జీన్స్ పాంట్లు, సెల్ ఫోన్ల వల్లే తప్పుదోవ పట్టే అవకాశాలు పెరుగుతున్నాయని పంచాయతీ పెద్దలు అభిప్రాయపడ్డారు. జీన్స్, మొబైల్స్ నిషేధంపై తమ మండల పరిధిలోని ఆడపిల్లల కుటుంబాలను సంప్రదించామని నిషేధం విధించిన పెద్దలు పేర్కొన్నారు. 
 
ఈ నిషేధం 2015 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని వారు తెలిపారు. తాము విధించిన నిషేధం పాటించకపోతే జరిమనా విధించడం కానీ, బహిష్కరించడం కానీ చేయడం లేదని వారు తెలిపారు.