శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (20:08 IST)

రాష్ట్రపతి ఎన్నికలు.. బీజేపీ సంఖ్యాబలం నో.. శశికళతో చేతులు కలుపుతారా?

బీజేపీ అభీష్టానికి అనువైన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపి నెగ్గించుకోవాలంటే బీజేపీ సంఖ్యాబలంతో సమస్య ఏర్పడింది. ఎలక్టోరల్ ఓట్లు పెంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక చేసేది లేక తమ

గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 13 స్థానాలు గెలుపొందింది. అయినప్పటికీ.. బల నిరూపణ ద్వారా గోవా సీఎంగా మనోహర్ పారికర్ పదవీ ప్రమాణం చేశారు. గోవా పాలనా పగ్గాలు చేపట్టేందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్‌ పరీకర్‌ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. పారికర్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
 
వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్‌ బ్లాక్‌(జీఎఫ్‌పీ) నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ) నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ పూర్తి మెజారిటీ గెలిచిన బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో 'నంబర్ గేమ్' పైనే దృష్టి పెట్టింది. 
 
బీజేపీ అభీష్టానికి అనువైన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపి నెగ్గించుకోవాలంటే బీజేపీ సంఖ్యాబలంతో సమస్య ఏర్పడింది. ఎలక్టోరల్ ఓట్లు పెంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక చేసేది లేక తమిళనాడు రూలింగ్ పార్టీ (అన్నాడీఎంకే)తో మంతనాలు మొదలెట్టింది.. అమిత్ షా అండ్ టీమ్. ఇందులో భాగంగా జైలులో ఉన్న శశికళతో సంప్రదింపులు జరిగిపోయినట్లు తెలిసింది. అంతేగాకుండా.. ఎన్డీఏ కూటమిలో చేరిపోడానికి శశికళ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్డీయేకు మద్దతిస్తే.. జైలు నుంచి బయటికి వచ్చేందుకు ఛాన్స్ దొరుకుతుందని ఆమె భావిస్తోంది. 
 
మరోవైపు మనోహర్ పారికర్, రాజ్ నాథ్ సింగ్ వారివారి రాష్ట్రాలకు తరలిపోవడంతో.. మోదీ క్యాబినెట్లో కొత్త ఖాళీలు కూడా ఏర్పడే అవకాశముంది. దీంతో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమైనట్లే. అన్నాడీఎంకే ఎంపీల్లో ఒకరిద్దరికి మోడీ టీమ్‌లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అన్నాడీఎంకే సహాయంతో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నిర్ణయించింది.