మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (10:26 IST)

రాబర్ట్ వాద్రా ఇష్యూ: హర్యానా అధికారిపై సస్పెన్షన్ వేటు!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు భూములను ధారాదత్తం చేసిన హర్యానా అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు వాద్రా భూ వ్యవహారాన్ని తిరగదోడతామని చెప్పడమే కాక, సదరు భూముల బదలాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాడు వాద్రాకు పూర్తిగా సహకరించిన అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ దల్బీర్ సింగ్‌ను హర్యానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 
గుర్గావ్ జిల్లాలోని రోజ్కా గుర్జార్ గ్రామంలో నమోదైన అక్రమ భూ బదలాయింపుకు సంబంధించి సింగ్ ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హర్యానా మాజీ మంత్రి బంధువైన దల్బీర్ సింగ్ దశాబ్ద కాలంగా గుర్గావ్-ఫరీదాబాద్‌లో ఎలాంటి బదిలీ లేకుండానే సుధీర్ఘకాలంగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు.
 
గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకే సింగ్‌పై చర్య తీసుకున్నట్లు హర్యానా ఆర్థిక శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు చెప్పారు.