Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

ఆదివారం, 2 జులై 2017 (13:15 IST)

Widgets Magazine

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. 
 
గతవారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో రామ్‌గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 
 
అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్‌ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్‌కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జే.శేఖర్ రెడ్డి డెయిరీలో తమిళ సిఎం పేరు...?

జే.శేఖర్ రెడ్డి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో ...

news

లోకేష్‌ ఇక కుప్పం నీదే... చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు ...

news

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్

పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న ...

news

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని చంపేసిన అక్క... ఎక్కడ?

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని అక్క చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ...

Widgets Magazine