శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (19:04 IST)

పార్లమెంట్‌కు సైకిల్ వచ్చిన ఎంపీ ఎవరు?... ఎవరి మాట కోసం..!

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, సొంత పార్టీ ఎంపీలకు అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. భూతాపాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా స్వల్ప దూర ప్రయాణాలకు సైకిల్‌ను ఉపయోగించాలంటూ ఎంపీలు, పార్టీ నేతలకు మోడీ విజ్ఞప్తి చేశారు. 
 
దీన్ని బీజేపీకి చెందిన ఎంపీ తు.చ తప్పుకుండా పాటించారు. ఆ ఎంపీ పేరు అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈయన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ నేత మోడీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ సోమవారం పార్లమెంటుకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. తొలుత మేఘ్వాల్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అభినందించారు. సైకిల్ తొక్కడం ద్వారా వాతావరణం‌లో కర్బన ఉద్గారాలను తగ్గించిన వారమవుతామన్నారు. అందుకే సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.