బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (14:14 IST)

పన్నీరును పార్టీ నుంచి వెలివేశారట.. సీఎం అభ్యర్థిగా పళనిసామి.. గవర్నర్ ముందు రెండే ఆప్షన్లు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎం పదవి చేపట్టేందుకు ఛాన్స్ లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి వెలివేశామని తంబిదులై వ్యాఖ్య

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎం పదవి చేపట్టేందుకు ఛాన్స్ లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి వెలివేశామని తంబిదులై వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. పళనిసామిని శాసనసభా పక్ష నేతగా తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సందిగ్ధత నెలకొంది. సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడగా.. సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్ సెల్వం చేతికి వెళ్లకూడదనే ఉద్దేశంతో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా శశికళ సూచించారు. 
 
దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు తలపట్టుకుని కూర్చున్నారు. ప్రస్తుతానికైతే గవర్నర్ ముందు రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బల నిరూపణకు ఆహ్వానించడం.. మరొకటి అసెంబ్లీని ఏర్పాటు చేసి సభలోనే సభా నాయకుడిని ఎన్నుకోమని సూచించడం.. ఈ రెండింటిలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
 
ఇప్పటివరకైతే గవర్నర్ నిర్ణయానికి సంబంధించి రాజ్ భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే.. పన్నీర్ వర్గంలో ధీమా కనిపిస్తున్నా.. ఆయన వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారనే తేలాల్సి వుంది. ఇంకా తంబిదురై పళని స్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.