గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:30 IST)

బీజేపీ-శివసేన సీట్ల గొడవ: బేజీపీ మహారాష్ట్రలో ఒంటరిపోరు?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ-శివసేన పార్టీల మధ్య వార్‌ను తలపిస్తోంది. ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ- శివసేన పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. తాము కోరిన 144 (126 బీజేపీ, 18 ఇతరులు) స్దానాలను ఇవ్వడానికి అంగీకరించాలంటూ శివసేనకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. 
 
ఈ లోగా శివసేన స్పందించకపోతే పొత్తు రద్దు చేసుకోవడానికి వెనుకాడబోమని అమిత్ షాని పూణెలో గురువారం రాత్రి కలిసిన మహారాష్ట్ర బీజేపీ నేత ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఫోన్ కాల్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
 
తాము కోరిన 144 (126 బీజేపీ, 18 ఇతరులు) స్థానాలను ఇవ్వని పక్షంలో బీజేపీ సొంతంగా అన్ని స్దానాల్లో పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అహ్మాద్‌నగర్‌లోని చొండి పబ్లిక్ ర్యాలీలో వెల్లడించనున్నారు. ఐతే శివసేన స్పందన మరోలా ఉంది. 
 
శివసేన ఎంపీ ఒకరు మాట్లాడుతూ శివసేనను అమిత్ షా పూర్తిగా మరచిపోయారు. బీజేపీ ఎందుకంత ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగానే పోటీ చేయమనండి అని పేర్కొన్నారు.
 
2009లో జరిగిన ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో పాల్గోందని, కానీ ఇప్పుడు 150 సీట్లలో పాల్గొనడానికి ఒప్పందం కుదిరినా బీజేపీ ఒప్పుకోవడం లేదన్నారు. మహారాష్ట్రలో శివసేన పెద్ద పార్టీ అన్న విషయాన్ని గమనించాలన్నారు. శివసేన మాత్రం బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన సీట్లలో ఆ పార్టీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో పొత్తులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 
 
కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, శివసేన చెరో 135 స్థానాల్లో పోటీ చేయాలని, మిగిలిన 18 సీట్లను చిన్న చిన్న పార్టీలకు కేటాయించాలని బీజేపీ వాదిస్తుంది. అయితే గత శనివారం 9 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి 119 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని శివసేన స్పష్టం చేస్తుంది.