గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (15:40 IST)

పోలింగ్ బూత్‌లవారీ ఫలితాలకు చెల్లుచీటి... ఎన్నికల సంస్కరణలకు మోడీ సర్కారు శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా 1961 నాటి ఎన్నికల నిబంధనల చట్టాలకు చెల్లుచీటి చెప్పనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా 1961 నాటి ఎన్నికల నిబంధనల చట్టాలకు చెల్లుచీటి చెప్పనున్నారు. అదేసమయంలో దేశ ఎన్నికల ప్రక్రియలో అతిపెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని మోడీ సారథ్యంలోని సర్కారు నిర్ణయించింది. 
 
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వారీగా ఎన్నికల ఫలితాలను విడుదల చేయరాదని ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలగాపులగం చేసి లెక్కింపును చేపట్టాలని, ఏ పోలింగ్ కేంద్రానికి చెందిన ఓటింగ్ యంత్రాలను లెక్కిస్తున్నామన్న విషయం అధికారులకు, అభ్యర్థుల ఏజంట్లకు తెలియాల్సిన అవసరం లేదని పేర్కొంటూ 1961 నాటి ఎన్నికల నిబంధనల చట్టానికి సవరణలకు క్యాబినెట్ ఆమోదం పలికింది. 
 
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌లతో కూడిన క్యాబినెట్ ఉన్నతస్థాయి సమావేశంలో ఎలక్షన్ కమిషన్ సిఫార్సులు, ప్రతిపాదనలకు ఆమోదం పలికినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.