Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గురువారం, 18 మే 2017 (17:22 IST)

Widgets Magazine

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్న కారణంతో హోటల్ యజమానిని ఓ యువకుడు గొంతుకోసి చంపేసిన ఘటన కేరళలోని మంగళప్పిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల రతీష్ అనే ట్యాక్సీ డ్రైవర్.. జాన్సన్ నడుపుతున్న హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌లో గారెలు ఆర్డర్ చేశాడు. ఫుల్‌గా లాగించేశాడు. ఆపై వడలు రుచిగా లేవని జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా జాన్సన్ రతీష్‌ను హోటల్‌ నుంచి గెంటేశాడు. 
 
బయటకు వెళ్లిన రతీష్.. ఫూటుగా తాగి.. బైకుపై వెళ్తున్న జాన్సన్‌ను అడ్డుకుని గొంతుకోసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్సన్ మరణించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రతీష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరిష్టం అని అంటున్నా మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదట... ఇంతకీ ఏంటది?

ఏదైనా శుభాకార్యాలకు వెళ్లేటపుడు పిల్లి ఎదురుపడ్డా, కట్టెలు కనిపించినా ఆ శుభకార్యాన్ని ...

news

అంతర్జాతీయ కోర్టులో పాక్‌కు చుక్కెదురు.. కులభూషణ్ ఉరిశిక్షపై స్టే..

భారత మాజీ నావికా దళ అధికారి కులభూషణ్ జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట లభించింది. ...

news

గర్భానికి తండ్రే కారణం.. మైనర్ బాలిక గర్భస్రావానికి అనుమతి.. వైద్యుల సలహాతో?

హర్యానాలో పదేళ్ల మైనర్ గర్భస్రావానికి అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహ్‌టక్‌కు ...

news

పాకిస్థాన్ అణ్వాయుధాలను అక్కడ భద్రంగా దాచేస్తోంది... భారత్‌కు గండమేనా?

పాకిస్థాన్ అణ్వాయుధాలను ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర దాస్తోందని ...

Widgets Magazine