శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (15:44 IST)

పాక్‌తో సంబంధాలు అంటగడుతున్నారు.. ఫోన్‌ను పగులకొట్టేశారు: తేజ్ బహదూర్

సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లేదంటూ దేశం దృష్టికి తీసుకువచ్చిన బీఎస్ఎస్ జవాన్ తేజ్ బహదూర్.. తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు. పాకిస్తాన్‌తో త

సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లేదంటూ దేశం దృష్టికి తీసుకువచ్చిన బీఎస్ఎస్ జవాన్ తేజ్ బహదూర్.. తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు. పాకిస్తాన్‌తో తనకు సంబంధాలను తనపై అధికారులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ వీడియోలో ఆరోపించారు. తనకు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధంలేదని బహదూర్ చెప్తున్నాడు. 
 
గతంలో తేజ్ బహదూర్ ఫేస్ బుక్‌లో వీడియో పోస్టు చేయడంతో బహదూరును జమ్మూ కాశ్మీర్ సెక్టార్‌కు మార్చారు. అయితే తన భర్త ఆచూకీ కోసం ఆయన భార్య షర్మిల డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశం మేరకు ఆమె ఎట్టకేలకు భర్తను కలిసింది. తాజాగా బహదూర్ విడుదల చేసిన వీడియాలో ఉన్నతాధికారులు తనను ఏరకంగా వేధిస్తున్నారనే విషయాన్ని వెల్లగక్కాడు. రక్షణ శాఖలోని అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. 
 
ఇంకా బహదూర్ ఆ వీడియోలో తన మొబైల్ ఫోనును ఉన్నతాధికారులు పగులకొట్టారన్నారు. మానసికంగా హింసిస్తున్నారని చెప్పాడు. ఆహారంలో నాణ్యత కొరవడిందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశానని బహదూర్ వ్యాఖ్యానించాడు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తనకు సహకరించాలని కోరాడు.