శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (06:08 IST)

భగత్‌సింగ్ చేయలేని పని నేను చేశా.. ఇందులో తప్పేంటి... ఇదిగో మరో వీడియో : బీఎస్ఎఫ్ జవాన్

భారత ఆర్మీలో అవినీతిని అరికట్టే విషయంలో జాతీయ విప్లవకారుడు భగత్ సింగ్ చేయలేని పనిని తాను చేశానని బీఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తేల్చి చెబుతున్నాడు. సరిహద్దుల్లోని సైనికుల జీవన పరిస్థితులపై విమర్శ చ

భారత ఆర్మీలో అవినీతిని అరికట్టే విషయంలో జాతీయ విప్లవకారుడు భగత్ సింగ్ చేయలేని పనిని తాను చేశానని బీఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తేల్చి చెబుతున్నాడు. సరిహద్దుల్లోని సైనికుల జీవన పరిస్థితులపై విమర్శ చేస్తూ ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేశాడు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుండగా, బీఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. అంతటితో ఊరుకోని బీఎస్ఎఫ్ ఆజవాన్‌పై వేటు వేసింది. 
 
దీనిపై యాదవ్ స్పందిస్తూ... తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు కానీ ఇక వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.
సరిహద్దుల్లోని సైనికులకు తిండి కూడా సరిగా పెట్టలేదని, పస్తులతో నిద్రపోవాల్సి వస్తోందని, అధికారుల అవినీతే ఇందుకు నిదర్శనం అని బీఎస్పీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోమవారం మూడు వీడీయోలను అప్‌లోడ్ చేయడం సంచలనానికి దారితీసింది.
 
అంతేకాకుండా, బీఎస్‌ఎఫ్ విచారణపై తనకు నమ్మకం లేదంటూ యాదవ్ మరొక ఆడియో క్లిప్‌ను మంగళవారం మళ్లీ పోస్ట్ చేశాడు. సైనికుల దుస్థితిపై తాను చేసిన పనివల్ల వేలాది మంది ఇతర జవాన్లకు మేలు చేకూరితే ఇక తాను వెనుదిరిగే ప్రసక్తే లేదన్నాడు. దేశవ్యాప్తంగా వైరల్ అయిన యాదవ్ ఫేస్‌‌బుక్ పోస్టు కారణంగా అధికారులు క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చంటున్న నేపథ్యంలో తాను వెనక్కు తగ్గేది లేదని యాదవ్ స్పష్టం చేశాడు. 
 
సోమవారం నేను అప్‌లోడ్ చేసిన వీడియోలను 60 లక్షల నుంచి 70 లక్షల మంది ప్రజలు చూశారని తెలిసింది. ఇంతమంది చూడటం ఇదే తొలిసారి. భారత్ ఖచ్చితంగా మేలుకొంటుందనటంలో సందేహం లేదని వ్యాఖ్యానించాడు. ప్రభుత్వం తమకు సరిపడినంత ఆహారాన్ని పంపిస్తున్నప్పటికీ సీనియర్లు, అధికారులు ఆ ఆహార పదార్థాలను అక్రమంగా మార్కెట్లో అమ్ముకుంటూ సాధారణ సైనికులు కడుపు మాడుస్తున్నారని ఈ జవాను ఆరోపించాడు. 
 
అంతేకాకుండా ఆ సైనికుడు తనకు ఇస్తున్న ఆహారాన్ని కూడా ఆ వీడియోల్లో ప్రదర్శించాడు. ఉదయం అల్పాహారంగా కేవలం ఒక పరాటాను, టీని మాత్రమే మాకు ఇస్తున్నారు. అందులో కూడా ఊరగాయ కానీ, కూరగాయలు కాని ఉండవు. మేం 11 గంటలపాటు డ్యూటీ చేయవలసి వస్తుంది. ఒక్కోసారి డ్యూటీ సమయం పొడవునా మేం నిలబడుకోవాల్సి వస్తుంది. ఇక భోజనం సమయంలో మాకు పసుపు, ఉప్పు కలిపిన పప్పుకూరను రోటీతో కలిపి ఇస్తారు. సరిహద్దుల్లో మాకు ఇస్తున్న ఆహారం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జవాన్ తన డ్యూటీని ఎలా చేయగలడు? మా దుస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై విచారించాలని ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థిస్తున్నానని ఆ సైనికుడు తెలిపాడు.