శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:39 IST)

బడ్జెట్ 2015-16 : జైట్లీ ప్రసంగంలోని హైలెట్స్ - 1

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఉదయం లోక్‌సభలో 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతితో ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అరుణ్ జైట్లీ నిల్చునే బడ్జెట్ ప్రసంగం చేయడంలో ఇబ్బంది పడటంతో ఆయన కూర్చొని బడ్జెట్ ప్రతులను చదువుతున్నారు. ఆయన ప్రసంగంలోని హైలెట్స్..
 
రూ.20 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో ముద్రా బ్యాంకు ఏర్పాటు
స్కాలర్ షిప్‌లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
2015-16 మధ్య ఆర్థిక అభివృద్ధి 8 నుంచి 8.5 శాతం పెరిగే అవకాశం
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గింది
లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం
పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వబోతున్నాం. 
ఆధార్ జన్ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి
వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం
రూపాయి మారకం విలువ బలపడుతోంది
పెట్టుబడులకు మన దేశం చాలా అనువైనది.
వృద్ధి రేటును పెంచేందుకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.
గతంలో లేని విధంగా రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇస్తున్నాం.
ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నాం. 
స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది.
పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని పారద్రోలటమే లక్ష్యం.
మాది నిరంతరం పనిచేసే ప్రభుత్వం. 
2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. 
2020 నాటికి సంపూర్ణ విద్యుదీకరణను పూర్తి చేస్తాం. 
విద్యుత్ గ్రిడ్‌తో సంబంధం లేని సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.
ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉద్యోగం కలిగి ఉండేలా చూస్తాం.