గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chj
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (13:43 IST)

పాలిస్తున్న లేగదూడ... చూసేందుకు క్యూ కడుతున్న జనం

తమిళనాడు లోని సేలం జిల్లాలో కాడయంపట్టి గ్రామంలో పదిరోజుల క్రితం పుట్టిన లేగదూడ పాలిస్తూ జనాలను ఆబ్బురపరుస్తుంది. వేలు అనే రైతుకు చెందిన ఓ ఆవు దూడను ఈనింది. ఆ లేగదూడ నేలపై కాలు మోపినప్పటి నుంచి దాని ప

తమిళనాడు లోని సేలం జిల్లాలో కాడయంపట్టి గ్రామంలో పదిరోజుల క్రితం పుట్టిన లేగదూడ పాలిస్తూ జనాలను ఆబ్బురపరుస్తుంది.  వేలు అనే రైతుకు చెందిన ఓ ఆవు దూడను ఈనింది. ఆ లేగదూడ నేలపై కాలు మోపినప్పటి నుంచి దాని పొదుగు నుంచి పాల చుక్కలు రాలాయి. ఆ దృశ్యాన్ని చూసిన రైతు వేలు దాని పొదుగును పితికి చూడగా పాలు కారింది.
 
గత పది రోజులుగా ఆ లేగదూడ రోజుకు అరలీటర్‌ చొప్పున పాలను ఇస్తోందని వేలు తెలిపాడు. స్థానిక వెటర్నరీ డాక్టర్‌ పాలిస్తున్న ఆ లేగదూడను పరిశీలించారు. హార్మోన్ల లోపం వల్ల లక్ష దూడలలో ఒక దూడకు పొదుగు నుంచి పాలు కారుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆ వింత దూడను చూడటానికి జనం వేలు ఇంటివద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు.