బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (09:08 IST)

రేప్ చేస్తుంటే మౌనంగా ఉండి సహకరించింది.. కామాంధుల వాంగ్మూలం

ఇటీవల బెంగుళూరులో జరిగిన నిర్భయ తరహా గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడింది ముగ్గురని తొలుత భావించారు. కానీ, అత్యాచారం చేసింది మాత్రం ఇద్దరేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేశారు. వారిద్దరిని యోగేష్, సునీల్‌గా గుర్తించారు. వీరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో గ్యాంగ్ రేప్ ఎలా చేసిందీ పూసగుచ్చినట్టు వివరించారు. 
 
బెంగుళూరులోని ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న ఈ యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి, బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత వ్యానులో మూడు గంటల పాటు సిటీలో తిప్పుతూ అత్యాచారం చేశారు. వాస్తవానికి ఆ యువతి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో యువతిని కిడ్నాప్ చేశారు. కానీ, వ్యానులో ఎక్కించిన తర్వాత తమ మనస్సు మారి.. ఆ యువతిని అత్యాచారం చేయాలని భావించామని చెప్పారు. 
 
అందుకు ఆ యువతి తొలుత నిరాకరించి, కేకలు వేసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. అయితే, వ్యానులోని టూల్ కిట్ వస్తువులతో హత్య చేస్తామని బెదిరించడంతో మిన్నకుండిపోయిందని చెప్పారు. ఆ తర్వాత తామిద్దరం మార్చిమార్చి అత్యాచారం చేశామని, ఆ సమయంలో ఆ యువతి నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదనీ చెప్పారు. దీనికి కారణం తాము చంపేస్తామని భయపడి, తమకు సహకరించిందని నిందితులు వెల్లడించారు.