శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (17:05 IST)

కేన్సర్ రోగి ఊరి నుంచి వెళ్లిపోలేదనీ సాఫ్ట్‌డ్రింక్ బాటిల్స్‌తో తల పగులగొట్టారు!

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కేన్సర్ సోకిన రోగి తమ ప్రాంతం వీడి వెళ్లలేదన్న కోపంతో సాఫ్ట్‌డ్రింగ్ బాటిల్స్‌తో తలపై కొట్టి చావబాదారు. అసలే కేన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకున్న ఆ రోగి.

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కేన్సర్ సోకిన రోగి తమ ప్రాంతం వీడి వెళ్లలేదన్న కోపంతో సాఫ్ట్‌డ్రింగ్ బాటిల్స్‌తో తలపై కొట్టి చావబాదారు. అసలే కేన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకున్న ఆ రోగి.. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హౌరాలోని బేలూరు ప్రాంతానికి చెందిన షేక్ మిరాజ్ అనే 35 యేళ్ళ వ్యక్తి కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న ఈ వ్యక్తి.. కేన్సర్ ఉండటంతో ఊరువిడిచి వెళ్ళిపోవాలని స్థానికులు ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీనికి అతను ససేమిరా అన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తన పనులు ముగించుకొని వస్తుండగా తాను ఉండే ప్రాంతానికి చెందిన యువకుల్లో ఓ యువకుడి కాలుకి తను బైక్ పార్కింగ్ చేస్తుండగా కొంచెం తగిలింది. దీంతో ఇదే అదనుగా తీసుకొని అక్కడ ఉన్నవారంతా అతడిని దారుణంగా కొట్టారు. సాఫ్ట్‌డ్రింక్ బాటిల్స్‌తో మిరాజ్ తల పగులగొట్టారు. బైక్ తగలడం తప్పే అని ఒప్పుకున్నా విడిచిపెట్టకుండా కొట్టి కాలనీ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. అతడి తలలో నాలుగు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. ప్రస్తుతం మిరాజ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి దిగిన యువకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధితుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు