Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మగాడితో లేచిపోతూ ప్రేయసి చెప్పిన కారణంతో దొంగగా మారిన 65 యేళ్ల వృద్ధుడు

గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:16 IST)

Widgets Magazine
thieves

దేశ రాజధాని ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో లేచిపోతూ చెప్పిన మాటకు 65 యేళ్ళ వ్యక్తి కార్ల దొంగగా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీకి చెందిన రాజ్ భాటియాకి వివాహం కాలేదు. గత తొమ్మిదేళ్లుగా పాలెం విహార్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివశిస్తూ వస్తున్నాడు. తరచూ లగ్జరీ కార్లలో తిరుగుతూ... స్నేహితులతో హడావిడి చేస్తుంటాడు. ఇటీవల ఓ హుండాయ్ క్రెటా కారు చోరీకి గురికావడంపై విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులకు అతడి గురించి ఉప్పందింది. 
 
పాలెం విహార్ ప్రాంతంలో ఆరాతీసిన పోలీసులు భాటియా వ్యవహారం మొత్తం బయటికి లాగారు. తన మాజీ ప్రియురాలు మరో వ్యక్తితో వెళ్లిపోతూ... తనకు హుండాయ్ క్రెటా కారంటే ప్రాణమనీ, అందుకే వెళ్లిపోతున్నానని చెప్పిందని తెలిపారు. ఈ కారణంగానే తాను కార్లదొంగ అవతారమెత్తినట్టు తెలిపారు. ఓ స్నేహితుడి దగ్గర్నుంచి యూనిక్ ఎలక్ట్రానిక్ కీ సంపాదించి సులభంగా కారు తాళాలు తీసి దొంగిలిస్తున్నట్టు భాటియా వెల్లడించాడు. 
 
ఇలా దొంగలించిన కార్లతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో ఎంజాయ్ చేయడం ఆ తర్వాత వాటిని రూ.1 నుంచి రూ.1.5 లక్షలకు అమ్మేయడమే తన దినచర్యగా మారినట్టు భాటియా వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు. కాగా, భాటియా నుంచి చోరీకి గురైన రెండు క్రెటా కార్లు, క్లోన్ చేసిన రెండు రిమోట్ తాళాలు, తప్పుడు నెంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
65-year-old Stole Cars Woman Arrest Car Theft

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాట అధికార మార్పిడి.. ఓపీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి.. పళనికి కేంద్ర పదవి? బీజేపీ పక్కా ప్లాన్

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం ఆ పార్టీలో ముసలం ...

news

చెంపలపై కొట్టి.. చున్నీతో మెడబిగించి హత్య చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా కేకలు..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి ...

news

అన్నాచెల్లెళ్ళట.. ప్రేమించుకున్నారట.. నగ్నంగా నడి వీధుల్లో నడిపించిన గ్రామ పెద్దలు

ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయేలా తీర్పునిచ్చింది. ...

news

కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని ...

Widgets Magazine