Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోమవారమే డెడ్‌లైన్.. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే..? ఆ కేసులో జయ పేరు తొలగింపుకు ఓకే

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:15 IST)

Widgets Magazine

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి కొనసాగుతోంది. సెల్వం, శశికళ వర్గాలు గవర్నర్ నిర్ణయం కోసం టెన్షన్‌గా వేచిస్తుండగా, ఆయన వైఖరిపై చిన్నమ్మ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ జాప్యానికి నిరసనగా నిరాహార దీక్ష చేయాలని శశికళ భావిస్తున్నట్టు సమాచారం.

అటు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా ఈ పరిణామాలు తమకే అనుకూలమని భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానించవచ్చుననే సంకేతాలను పంపుతోంది. స్టాలిన్ సోమవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా రాజకీయ భవితవ్యం, కార్యాచరణపై చర్చించనున్నారు.
 
ఈ నేపథ్యంలో సోమవారంలోగా సీఎం ఎవరనే సమస్యపై (గవర్నర్‌) నిర్ణయం తీసుకోవాలని లేకపోతే సుప్రీం కోర్టులో పిల్ వేస్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అల్టిమేటం ట్విట్టర్లో అల్టీమేటం జారీ చేసింది. కావాలనే బేరసారాలకు అవకాశం కల్పిస్తున్నారంటూ అధికరణ 32 కింద ఫిర్యాదు చేస్తానన్నారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వకుండా గవర్నర్‌ కాలయాపన చేయడం సరి కాదని, ఆయన రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఇదిలా ఉండగా, తాను దాఖలుచేసిన అక్రమాస్తుల కేసు నుంచి దివంగత జయలలిత పేరు తొలగింపునకు సుబ్రమణ్యస్వామి సుముఖత వ్యక్తం చేశారు. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు స్వామి తన మద్దతు తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Swamy Governor Tamilnadu Sasikala Jayalalithaa Case Of Horse Trading

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మ నుంచి పన్నీర్ క్యాంపుకు పాండ్యరాజన్ జంప్.. అరుణ్ జైట్లీ హస్తముందా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ ...

news

అమ్మతో మాట్లాడినా సహించని భూతం శశికళ: మండిపడ్డ సెల్వం

ఒక వైపు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు తన పక్షం చేరకపోవడం, మరోవైపు తనను అమ్మకు ద్రోహం ...

news

వలసపోని ఎమ్మెల్యేలు.. శశికళలో కొత్త ఉత్సాహం..

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఊహించిన స్థాయిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వలస ...

news

పన్నీర్ చెంత ఎంపీలు... శశికళ చెంత ఎమ్మెల్యేలు.. బెడిసికొట్టిన వ్యూహాలు!

తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా స్తంభనకు గురయ్యాయా? ఆదివారం సాయంత్రానికి ఆపద్ధర్మ ...

Widgets Magazine