మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (16:44 IST)

సెల్ఫీ పిచ్చి.. గుట్టపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండగా.. సముద్రంలో కలిసిపోయారు.

సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోతోంది. యువత సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎగసి పడుతున్న అలలతో సెల్ఫీ తీసుకోవాలనుకున్న యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. సముద్రంల

సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోతోంది. యువత సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎగసి పడుతున్న అలలతో సెల్ఫీ తీసుకోవాలనుకున్న యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. సముద్రంలో కొంత దూరం చొచ్చుకు వెళ్లినట్లు ఉన్న ఓ గుట్టపై కూర్చుని అలలలో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ అలలే యువకులను మింగేశాయి. సముద్రంలో కలిరపేశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజ‌స్థాన్‌కు చెందిన అయిదుమంది యువ‌కులు కేంద్ర పాలిత ప్రాంతం డ‌య్యూకు విహారానికి వెళ్లారు. డ‌య్యూలో కేవ‌డి నిర్మాణ సంస్థ ప్రాజెక్టులో వాళ్లు ప‌నిచేస్తున్నారు. ఆదివారం సెల‌వురోజు కావ‌డంతో స‌ర‌దాగా డ‌య్యూలోని న‌గావూ బీచ్‌కు వెళ్లారు. అక్క‌డ ఓ గుట్ట‌పై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండ‌గా.. సముద్రంలోకి ఐదుగురు యువకులు కొట్టుకుపోయారు. వారిని పృథ్వీ రాజ్‌పుత్‌, చందు సింగ్‌, జీత్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. 
 
మ‌రో ఇద్ద‌రు ప్రాణాల‌తో త‌ప్పించుకోగ‌లిగారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇద్ద‌రి మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు డ‌య్యూ పోలీసులు తెలిపారు.