Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (16:48 IST)

Widgets Magazine
private buses

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 కిలోమీటర్ల మేర బస్సుతో పాటు లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మొహినుద్ధీన్ (45) అనే బస్సు డ్రైవర్ తమిళనాడులోని కూనూర్ నుంచి నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో బెంగళూరుకు బయల్దేరాడు. 
 
మైసూర్- చిన్నపట్నం మార్గం మీదుగా బెంగళూరు వెళ్తున్న క్రమంలో చిన్నపట్నం చేరుకున్నాడు. అక్కడి నుంచి శాంతి నగర్ బస్సు డిపోకు తీసుకెళ్లిన డ్రైవర్ మొహినుద్దీన్ అనంతరం బస్సును పార్క్ చేసి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం బస్సును శుభ్రం చేస్తుండగా.. బస్సు వెనుకభాగంలో మృతదేహం ఇరుక్కున్నట్లు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
 
అయితే బస్సు డ్రైవర్ మాత్రం తనకు డ్రైవింగ్‌లో పదేళ్ల అనుభవం వుందని.. ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదని విచారణలో వాపోయాడు. బస్సు వెనుక ఏదో తగిలినట్టు శబ్ధం వినిపించిందని.. రాయి అనుకుని అద్దంలో చూడగా ఏమీ కనిపించలేదని పోలీసులకు తెలిపాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి ...

news

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా

తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర ...

news

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ...

news

ఆ విషయం బ్రహ్మీకే వదిలేస్తున్నా- అమ్మ, బ్రహ్మి సంపాదిస్తే?: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ఆసక్తికరమైన ...

Widgets Magazine