శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (19:49 IST)

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు: చిద్దూపై సీబీఐ ప్రశ్నల వర్షం..

స్కాముల్లో ఇరుక్కున్న యుపీఏ మంత్రుల చీటీలు ఒక్కొక్కటే చిరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో నాటి ఆర్థిక మంత్రి చిదంబరంపై సీబీఐ ప్రశ్నలవర్షం కురిపించింది. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. 
 
అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.3,500 కోట్ల విలువైన ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. 
 
ఈ విషయమై సీబీఐ ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారంటూ సీబీఐ పలు విధాలుగా ప్రశ్నిస్తూ చిందంబరం వద్ద వివరాలు అడిగింది.