శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:08 IST)

యూపీఏ, ఎన్డీయేలు ఫుట్‌బాల్ ఆడుకున్నాయ్.. విజయ్ మాల్యా రుసరుసలు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా..తనను ఫుట్ బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా..తనను ఫుట్ బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండానే తాను టీమ్ యూపీఏకు, టీమ్ ఎన్‌డీయేకు ఓ ఫుట్ బాల్ లాగా మారినట్టు శుక్రవారం ట్వీట్ చేశారు.
 
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సాయడ్డారని బీజేపీ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉందని తెలిసి కూడా కింగ్ ఫిషర్‌కు రుణాలు ఇప్పించారని విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించిన పత్రాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా ముందుకు తీసుకొచ్చారు. 
 
దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన మాల్యా తాను ఒక ఫుట్ బాల్‌నని, న్యాయనిర్ణేత ఎవరూ లేకుండానే ఎన్డీయే, యూపీఏ టీమ్‌లు తనను ఆడుకుంటున్నాయని విమర్శించారు. సీబీఐ ఆరోపణలపై తాను షాక్‌కి గురయ్యానని, బిజినెస్, ఎకనామిక్స్ గురించి పోలీసులకు ఏమి తెలుసని మాల్యా మండిపడ్డారు.
 
ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్‍కు రప్పించాలని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని చేతులెత్తేసిన నేపథ్యంలో.. సీబీఐ కావాలనే వక్రీకరించిన ఈ-మెయిల్స్‌ను మీడియాకు విడుదల చేసిందని, తనకు, యూపీఏ పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలకు పాల్పడిందని మాల్యా శుక్రవారం ట్వీట్ చేశారు.