బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:38 IST)

మోర్టార్లతో భారత సైనిక స్థావరాలపై దాడి... పాక్ మరోమారు కాల్పుల ఉల్లంఘన

పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై ప

పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు తెగబడింది. 
 
రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై పాక్ ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు అర్ధరాత్రి దాటాక(బుధవారం ) 1:30 గంటల వరకు కొనసాగినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
ఇందుకోసం 82 ఎంఎం మోర్టార్లు, ఆటోమెటిక్స్ ఉపయోగించి పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఆదివారం పాక్ దళాల కాల్పుల్లో భారత‌ జవాను ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.