Widgets Magazine

హెల్మెట్ ధరించలేదని.. వెంటబడిన పోలీసులు.. యువతి కిందపడి?

హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పో

helmet new
selvi| Last Updated: గురువారం, 8 మార్చి 2018 (12:44 IST)
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చి, తిరువెంబూరు చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రాజా అనే యువకుడు.. బైక్‌ను ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్ వారి వెంటపడ్డాడు. ఈ క్రమంలో రాజా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజా సతీమణి దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజా బైకును ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఢీకొనడంతోనే ఆతని భార్య కిందపడి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :