Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శోభనం తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్ నాటకం... జీడిమామిడి తోటలో నిప్పంటించాడు

గురువారం, 6 జులై 2017 (09:21 IST)

Widgets Magazine
sadist

ఓ కామాంధుడి ఆడిన నాటకానికి ఓ యువతి మోసపోయింది. ప్రేమ, పెళ్లి, శోభనం తర్వాత మనం కలిసివుండటం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టంలేదనీ నమ్మించిన ఆ కామాంధుడు... ఆత్మహత్యే శరణ్యమన్నాడు. ఇందుకు ఆ యువతి కూడా సమ్మతించింది. చివరకు ఆ యువతిని ఎవరూ లేని జీడిమామిడి తోటలోకి తీసుకెళ్లి అక్కడ కూడా చివరిసారిగా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత డీజిల్ పోసి నిప్పంటించాడో కిరాతకుడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై కొళత్తూరుకు చెందిన శక్తి (23) అనే యువతికి సేలంకు చెందిన మురళి అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో గత జూన్‌ 28న మురళి, శక్తిలు కలిసి తంజావూరుకు వెళ్లారు. అనంతరం బన్రుట్టికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని నాలుగు రోజుల పాటు కాపురం చేశాడు. 
 
పిమ్మట మురళి ఉన్నట్టుండి తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించటం లేదంటూ ఇక తమకు చావే శరణ్యమని శక్తిని నమ్మించాడు. దీనికి కూడా ఆమె సమ్మతం తెలిపింది. అయితే, ఇద్దరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుందామని అతడికి తెలిపింది. శక్తి షరతుకు మురళి సరేనన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బన్రుట్టిలోని జీడిమామిడి తోట వద్దకు వెళ్లారు. అక్కడ చివరిసారి ఏకాంతంగా ఉన్నారు. ఆ తర్వాత శక్తిపై మురళి డీజిల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. 
 
ఆసమయానికి అటుగా వస్తున్న 108 అంబులెన్స్ డ్రైవర్ ఒకరు మంటల్లో చిక్కుకున్న శక్తిని రక్షించి బన్రుట్టి ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న శక్తి... జరిగిన విషయాన్ని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మురళిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏమండీ.. మీ నాన్న అత్యాచారం చేశాడు.. భార్య :: నీకు మామే కదా... సర్దుకుపోవే.. భర్త

సభ్యసమాజం తలదించుకునే చర్య. మానవ సంబంధాలకు మాయని మచ్చ. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై ...

news

పాలకుడి గుండె చెమర్చిన వేళ.. ప్రసన్నకు బాబు అభయహస్తం

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహిరంగంగా తొలిసారిగా కంట తడిపెట్టిన పాలకుడాయన. కన్నతండ్రి ...

news

సంబంధం పెట్టుకుని మధ్యలో వద్దంటావా.. వెయ్.. పొడిచేశాడు

రక్తం మరిగిన పులి వేట మానుతుందా.. వివాహేతర సంబంధాన్ని రుచిచూసిన మగాడు మధ్యలో వద్దు పోవోయ్ ...

news

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు చంద్రబాబు 20 లక్షల సహాయం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్య, కూతుళ్ళను దారుణంగా హత్య చేసిన నిందితుడు ...

Widgets Magazine