బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (17:58 IST)

సినిమా థియేటర్‌లో జాతీయ గీతాలాపన.. లేచి నిలబడని వ్యక్తులపై దాడి.. ఎక్కడ?

సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ

సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సినిమా ప్రారంభం కంటే ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని ఆదేశాలిచ్చింది. జాతీయ జెండాను తెరపై ప్రదర్శించాలని పేర్కొంది. థియేటర్ లోని ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పింది. 
 
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్‌లో జాతీయగీతం ప్రదర్శిస్తున్న సమయంలో లేచి నిలుచోలేదని ముగ్గురు వ్యక్తులపై పలువురు దాడికి దిగారు. ఈ ఘటన చైన్నైలోని వడపలాని ప్రాంతంలోని పలాజో సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది. చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా థియేటర్‌లో సినిమా ప్రదర్శిస్తున్నారు.
 
సినిమాకు ముందు జాతీయ గీతం ప్రదర్శిస్తుండగా ముగ్గురు వ్యక్తులు లేచి నిల్చునేందుకు నిరాకరించారు. దీంతో నిర్వాహకులు, ప్రేక్షకులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో గతనెలలో కూడా ఓ థియేటర్‌లో ఇదే తరహాలో ముగ్గురిపై దాడి జరిగింది.