మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (19:47 IST)

చెన్నై టెక్కీ అత్యాచారం.. హత్య కేసులో ముద్దాయిలకు జీవితఖైదు!

చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహేశ్వరిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముద్దాయిలుగా తేలిన ముగ్గురికి చెంగల్పట్టు మహిళా కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 
 
శుక్రవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీపార్కులోని టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉమామహేశ్వరిపై గత ఫిబ్రవరి 13వ తేదీన రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ అనే బీహారీ వలస కూలీలు అత్యాచారం చేశారు. అనంతరం, హత్య చేశారు. దీనిపై విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఆమె డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేసిన ఓ వ్యక్తిని కనిపెట్టి, వారి కాల్ డేటా పరిశీలించి రామ్, ఉత్తమ్‌ను విచారించారు. వారు నేరం అంగీకరించడంతో కోల్‌కతా పారిపోయిన ఉజ్జల్ మండల్‌ను వెతికిపట్టుకున్నారు. అనంతరం 51 మంది సాక్షులను, 119 ఎగ్జిబిట్లను, 61 వస్తువులను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది.