శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (09:38 IST)

మోడీగారు... అందరికీ పండ్లు, పూలు ఇచ్చారు.. మాకు మాత్రం మొండిచేతులు చూపారు: టీఎస్ ఠాకూర్

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి సోమవారం చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావించకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్.ఠాకూర

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి సోమవారం చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావించకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్.ఠాకూర్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రధాని గంటన్నరపాటు చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావిస్తారని ఎదురుచూశానని, కానీ తనకు నిరాశే మిగిలిందన్నారు. 'నేను ప్రధానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు పేదరికాన్ని నిర్మూలించండి.. యువతకు ఉపాధి కల్పించండి.. అదేసమయంలో సామాన్యుడికి న్యాయం చేసేందుకూ ప్రయత్నించండి' అని వ్యాఖ్యానించారు. 
 
'మీరు ఇతరులకు పండ్లు, పూలు ఇచ్చారు. మాకు మాత్రం మొండిచేతులు చూపారు. మాకూ ఏదైనా ప్రసాదించండి' అని అర్థం వచ్చే ఉర్దూ పద్యాన్ని సీజే ఠాకూర్ చదివి వినిపించారు. మరోవైపు ప్రధాని ప్రసంగంపై సుప్రీం సీజే అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్పందించాయి. జడ్జీల నియామకంపై సీజే మాటలను ఆలకించాలని కాంగ్రెస్‌ కోరింది.